AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. అంతేకాక తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 […]

ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్
Ravi Kiran
|

Updated on: Nov 22, 2019 | 9:44 PM

Share

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. అంతేకాక తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు ఉన్నాయన్నారు. అటు కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలని.. పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

మరోవైపు సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా.. డీజిల్ బకాయిలను కూడా చెల్లించాలని కేసీఆర్ తెలిపారు. కాలం చెల్లిన 2600 బస్సులను రీ-ప్లేస్ చేయాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు ఆర్టీసీని నడపడం… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తం భారమంతా భరించే శక్తి  ఆర్టీసీకి లేదు.. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఆర్టీసీ వీటన్నింటిని అధిగమించడానికి ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేసినా.. పూర్తిగా వీటి నుంచి బయటపడాలంటే ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం.. ఒకవేళ అదే జరిగితే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆర్టీసీని యధావిధిగా నడపడం అసాధ్యమని సీఎం తేల్చి చెప్పారు. కాగా, రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉండటం వల్ల.. తీర్పు అనంతరం మరోసారి అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

కాగా, ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు హైకోర్టు తీర్పును గౌరవించి సమ్మెను విరమించారు. ప్రభుత్వం షరతులు విధించకుండా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరిన సంగతి విదితమే. ఈ తరుణంలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వెలువడే తీర్పు తర్వాత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి