విక్రమ్ ఆకృతి చెక్కుచెదిరిందా..? స్పష్టత లేదంటున్న ఇస్రో..

చంద్రయాన్ -2 ల్యాండర్ విక్రమ్ భూమితో సంబంధాన్ని కోల్పోయిన కొన్ని రోజుల తరువాత చంద్రుని ఉపరితలంపై ‘చెక్కుచెదరకుండా’ పడి ఉన్నట్లు ఇస్రో అధికారి ఒకరు నివేదిక తయారు చేశారు. అయితే ఈ నివేదికను ఇస్రో చైర్మన్ నిరాకరించారు. విక్రమ్ యొక్క కమ్యూనికేషన్ సంకేతాలు వచ్చేనప్పుడే దీనిపై స్పష్టత వస్తుందని ఇస్రో కార్యాలయం తెలిపింది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 వ్యోమనౌకలోని ల్యాండర్ శనివారం తెల్లవారుజామున చంద్రుడిపై కాలుమోపడానికి ముందు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే చంద్రుని ఉపరితలం […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:29 am, Tue, 10 September 19
విక్రమ్ ఆకృతి చెక్కుచెదిరిందా..? స్పష్టత లేదంటున్న ఇస్రో..

చంద్రయాన్ -2 ల్యాండర్ విక్రమ్ భూమితో సంబంధాన్ని కోల్పోయిన కొన్ని రోజుల తరువాత చంద్రుని ఉపరితలంపై ‘చెక్కుచెదరకుండా’ పడి ఉన్నట్లు ఇస్రో అధికారి ఒకరు నివేదిక తయారు చేశారు. అయితే ఈ నివేదికను ఇస్రో చైర్మన్ నిరాకరించారు. విక్రమ్ యొక్క కమ్యూనికేషన్ సంకేతాలు వచ్చేనప్పుడే దీనిపై స్పష్టత వస్తుందని ఇస్రో కార్యాలయం తెలిపింది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 వ్యోమనౌకలోని ల్యాండర్ శనివారం తెల్లవారుజామున చంద్రుడిపై కాలుమోపడానికి ముందు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే చంద్రుని ఉపరితలం నుండి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు చంద్రయాన్ 2 బెంగళూరులోని మిషన్ కమాండ్ సెంటర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.

ఇక తాజాగా ఆదివారం, చంద్రుని ఉపరితలం పై విక్రమ్‌ను గుర్తించగలిగానని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు విక్రమ్ సింగిల్ పీస్‌లో ఉన్నట్లు కనుక్కోబడిందని, చంద్రుని ఉపరితలంపై వంగి పడి ఉందని అన్నారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్‌లోని కెమెరాలు పంపిన చిత్రాలను బట్టి ఇది స్పష్టమవుతోందన్నారు. అయితే ఈ వార్తలను ఇస్రో ఛైర్మన్ ఖండించారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని చెప్పారు. మరోవైపు చంద్రయాన్ 2 ప్రాజెక్టులో పాలు పంచుకున్న భారత శాస్ర్తవేత్తలపై చైనా నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ల్యాండర్‌లో ఎదురైన ఇబ్బందితో ధైర్యం కోల్పోవద్దని.. పరిశోధనలు సాగించాలని చెప్పారు. రోధసి పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు గొప్ప విజయాలు సాధించారని, ఎన్నో త్యాగాలు చేశారని వారు గుర్తుచేశారు.