AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ కేబినెట్‌లో.. అపర చాణక్యుడికి మొండి చెయ్యి.?

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలను చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. ఎన్నికల్లో సదా మోదీ వెన్నంటే ఉన్న అపర చాణక్యుడు, బీజేపీ […]

మోదీ కేబినెట్‌లో.. అపర చాణక్యుడికి మొండి చెయ్యి.?
Ravi Kiran
|

Updated on: May 28, 2019 | 3:53 PM

Share

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలను చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. ఎన్నికల్లో సదా మోదీ వెన్నంటే ఉన్న అపర చాణక్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరిస్థితి ఇప్పుడేంటి అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ కొత్త కేబినెట్‌లో ఈయనకు స్థానం లభిస్తుందా అన్నది ప్రధాన అజెండాగా మారింది.

ఇది ఇలా ఉంటే మొన్నటిదాకా పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన అమిత్ షా.. ఈ ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. దీనితో కొత్తగా కొలువుదీరబోయే మోదీ కేబినెట్‌లో అమిత్ షా‌కు కీలక శాఖ దక్కుతుందని అందరూ భావించారు. హోమ్, రక్షణ, ఆర్ధిక.. ఇలా పలు శాఖల్లో ఏదో ఒక దానిని ఆయనకు అప్పగిస్తారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అమిత్ షా‌కు మోదీ నయా కేబినెట్‌లో చోటు దక్కడం లేదని అంటున్నారు. ఈసారి కూడా అమిత్ షా‌ను తన కేబినెట్‌లోకి తీసుకోకపోవడంలో నరేంద్ర మోదీ ఆంతర్యం ఏమిటో తెలియదు గానీ.. ఆయనకుకు మొండి చెయ్యి ఇచ్చి పార్టీలో ఇదివరకు మాదిరే క్రీయాశీలక పాత్ర కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఘన విజయం దిశగా నడిపించడానికి అమిత్ షా చేసిన కృషి, ఆయన పట్టుదలను మోదీ విస్మరించలేదు. ఈ నేపథ్యంలో తనకు కుడి భుజంగా ఉన్న ఈయనకు కేబినెట్ మంత్రిగా కన్నా పార్టీలో అత్యున్నత స్థాయిని కల్పించాలన్నదే మోదీ లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి