ఏపీలో ‘స్ట్రెయిన్’ వైరస్ లేదు.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.!

New Corona Strain: బ్రిటన్‌లో కొత్తరకం కరోనా 'స్ట్రెయిన్' వైరస్ విజృంభణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం...

ఏపీలో 'స్ట్రెయిన్' వైరస్ లేదు.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 24, 2020 | 6:29 PM

New Corona Strain: బ్రిటన్‌లో కొత్తరకం కరోనా ‘స్ట్రెయిన్’ వైరస్ విజృంభణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి సారించింది. విమానాశ్రయాల్లోనే వారికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆమె కుమారుడికి మాత్రం పరీక్షల్లో నెగటివ్ తేలిందని ఆయన అన్నారు. సదరు మహిళకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆమె నమూనాలను సేకరించి పూణే ల్యాబ్‌కు పంపించామని.. ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని.. ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్