ట్రంప్ ర్యాలీలో భారత జాతీయ పతాకం ఎగురవేసిన వ్యక్తి ఈయనే ! తప్పు లేదంటున్న డొనాల్డ్ అభిమాని

ఈ నెల 7 న వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన మద్దతుదారుల చేతుల్లో అమెరికా జాతీయ పతాకాలు,

ట్రంప్ ర్యాలీలో భారత జాతీయ పతాకం ఎగురవేసిన వ్యక్తి ఈయనే ! తప్పు లేదంటున్న డొనాల్డ్ అభిమాని
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2021 | 11:26 AM

ఈ నెల 7 న వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన మద్దతుదారుల చేతుల్లో అమెరికా జాతీయ పతాకాలు, ట్రంప్ ముఖచిత్రంత్జో కూడిన బ్యానర్లు కనిపించాయి. అయితే ఇంత భారీ ర్యాలీలోనూ ఓ వ్యక్తి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించడం వీడియోకెక్కి  సంచలనం  సృష్టించింది. ఇది ముఖ్యంగా  ఇండియాలో పెను వివాదానికి దారి తీసింది. దీనిపై  బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మధ్య ట్విటర్ వార్ నడిచింది. పదవి నుంచి దిగిపోతున్న ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలో మన పతాకం కనిపించడమేమిటని ఒకరు, ఇందులో తప్పేమిటని మరొకరు ఇలా వాదోపవాదాలు సాగాయి. మొత్తానికి ఇంత వివాదానికి కారకుడైన ఆ వ్యక్తి పేరు విన్సెంట్ జేవియర్. ఇండియన్ అమెరికన్ అయిన ఈయన తన చర్యను సమర్థించుకున్నారు. మన దేశ  పతాకమే కాదని, మరో రెండు దేశాల పతాకాలను కూడా తాను పట్టుకున్నానని ఆయన చెప్పారు. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నంత మాత్రాన ఇండియా అంటే తనకు అగౌరవం లేదని, ఇండియాను ఎంతో అభిమానిస్తానని ఆయన తెలిపారు.

నా చర్యకు నేనేమీ సిగ్గుపడడంలేదు, నేను ట్రంప్ మద్దతుదారుడిని.. రిపబ్లికన్ పార్టీ జాతివివక్షను పాటించడం లేదని చెప్పిన ఆయన, ఆ పార్టీ రేసిస్ట్ అయితే భారత జాతీయ పతాకాన్ని పట్టుకునేందుకు నన్నెందుకు  అనుమతించేదని ప్రశ్నించారు. 2015 లో కాంగ్రెస్ నేత శశిథరూర్ వాషింగ్టన్ కు వచ్చినప్పుడు లంచ్ సమయంలో తను ఆయనను ఇంటర్వ్యూ చేశానని చెప్పిన జేవియర్.. థరూర్ మంచి ఆరేటర్ అని, ఇలాంటి వివాదాలకు దిగేబదులు ఆయన ఇండియాలో తన కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..