‘తమకేమైనా పిచ్చా’.. ఎంఐఎంతో పొత్తులేదు.. తెగేసి చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పొత్తుల అంశంపై కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ విధానాలు బాగుండి, ఎంఐఎం తమకు మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం కానీ.. ఎంఐఎంకి ఎందుకిస్తామన్నారు. […]

'తమకేమైనా పిచ్చా'.. ఎంఐఎంతో పొత్తులేదు.. తెగేసి చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 19, 2020 | 3:58 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పొత్తుల అంశంపై కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ విధానాలు బాగుండి, ఎంఐఎం తమకు మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం కానీ.. ఎంఐఎంకి ఎందుకిస్తామన్నారు. డిసెంబర్ నాలుగున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని, ఎవరితో తమకు పొత్తు లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అనేక అంశాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని, ఈసారి కూడా అదే ఛాలెంజ్ మళ్లీ చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… ‘ప్రతిసారి నేనే ఛాలెంజ్ చేయాలా? ఈసారి వాళ్లను చేయమనండి. వాళ్లు ఛాలెంజ్ చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా’ అని కేటీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. తామైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని.. గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని.. గోల్కొండపై కేసీఆర్ జాతీయ జెండాను ఎప్పుడో ఎగరేశారని… ఆ విషయం బండి సంజయ్ కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గోల్కొండపై కొత్తగా బండి సంజయ్ ఎగరేసేదేమీ లేదని కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!