బన్నీ మాయలో పడిపోయాః నివేదా

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సునీల్, హీరోయిన్ నివేదా పేతురాజ్ కలిసి మాట్లాడి.. కాసేపు నవ్వులు పూయించారు. నివేదా తమిళియన్ కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడారు.. ఇక సునీల్‌ను తను మాట్లాడే మాటలను తెలుగులోకి తర్జుమా చేయమని చెప్పారు. సునీల్ ఏమో తనదైన శైలిలో వాటిని తికమకగా మార్చి ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ సినిమాలో బ‌న్నీతో […]

  • Ravi Kiran
  • Publish Date - 9:59 pm, Mon, 6 January 20
బన్నీ మాయలో పడిపోయాః నివేదా

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సునీల్, హీరోయిన్ నివేదా పేతురాజ్ కలిసి మాట్లాడి.. కాసేపు నవ్వులు పూయించారు. నివేదా తమిళియన్ కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడారు.. ఇక సునీల్‌ను తను మాట్లాడే మాటలను తెలుగులోకి తర్జుమా చేయమని చెప్పారు. సునీల్ ఏమో తనదైన శైలిలో వాటిని తికమకగా మార్చి ఫ్యాన్స్‌ను అలరించారు.

ఈ సినిమాలో బ‌న్నీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళంలో నేను ప‌నిచేసి పెద్ద సినిమా ఇదే. త్రివిక్ర‌మ్‌గారు సినిమాను డిఫ‌రెంట్‌గా తెర‌కెక్కించారు.బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌, అర‌వింద్‌, సుశాంత్‌, చిన‌బాబు స‌హా అంద‌రికీ పెద్ద థ్యాంక్స్‌. సినిమా కోసం ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నానని నివేదా తన స్పీచ్‌ను ముగించారు. కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.