నాలో ఈ యాంగిల్ ఉందని.. ఈ సినిమాతోనే తెలిసింది: సుశాంత్‌

నన్ను నాకే కొత్తగా చూపించారని అన్నారు హీరో సుశాంత్. అసలు నాలో ఈ యాంగిల్ కూడా ఉందని.. ఇలా కూడా నటించవచ్చని నాకు ఈ సినిమాతోనే తెలిసిందని చెప్పారు సుశాంత్. రెండు మూడు వర్షన్స్‌లో నన్ను ఈ సినిమాలో బాగా చూపించారు. అంతేకాకుండా.. నేను ముందు ముందు ఏ రూట్‌లో వెళ్లాలో కూడా ఈ చిత్రం నాకు హెల్ప్ చేసిందని చెప్పారు సుశాంత్. ఇక ఇంత పెద్ద సినిమాలో బన్నీతో ఫ్రీగా ఉన్నట్లు ఎవరితోనూ ఉంటానని నేను […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:42 pm, Mon, 6 January 20
నాలో ఈ యాంగిల్ ఉందని.. ఈ సినిమాతోనే తెలిసింది: సుశాంత్‌

నన్ను నాకే కొత్తగా చూపించారని అన్నారు హీరో సుశాంత్. అసలు నాలో ఈ యాంగిల్ కూడా ఉందని.. ఇలా కూడా నటించవచ్చని నాకు ఈ సినిమాతోనే తెలిసిందని చెప్పారు సుశాంత్. రెండు మూడు వర్షన్స్‌లో నన్ను ఈ సినిమాలో బాగా చూపించారు. అంతేకాకుండా.. నేను ముందు ముందు ఏ రూట్‌లో వెళ్లాలో కూడా ఈ చిత్రం నాకు హెల్ప్ చేసిందని చెప్పారు సుశాంత్. ఇక ఇంత పెద్ద సినిమాలో బన్నీతో ఫ్రీగా ఉన్నట్లు ఎవరితోనూ ఉంటానని నేను అనుకోలేదని తెలిపారు. కాగా.. ఈసినిమా అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కి ధన్యవాదాలు చెప్పారు సుశాంత్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వీరిద్దరి కలయికలో ఇది మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటిని కొల్లగొట్టాయి.