తెలంగాణలో రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు బంద్..

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానుండటంతో.. రేపట్నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు బంద్..
Follow us

|

Updated on: Sep 07, 2020 | 3:03 PM

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానుండటంతో.. రేపట్నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని నిలిపివేసిన సర్కార్.. చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్క రోజే రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. (Registrations Stopped In Telangana)

అటు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను అన్ని జిల్లాల కలెక్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు సాయంత్రం 5 గంటల కల్లా ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు రిపోర్ట్‌లు పంపించనున్నారు. ఇక కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అమల్లోకి రానుండగా.. ఇకపై జరిగే రిజిస్ట్రేషన్లను ఆ చట్టం ప్రకారమే జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్లను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: వారికి ఫుల్ రీఫండ్ లేదా ఫ్రీ టికెట్: కేంద్రం