శర్వానంద్ ‘మహా సముద్రం’ వచ్చేస్తోంది…

'గమ్యం', 'ప్రస్థానం' వంటి చిత్రాల తర్వాత  అదే రేంజ్‌లో శర్వానంద్‌ మరోసారి మెప్పించనున్నారు. వెర్సటైల్‌ యాక్టర్‌ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా 'మహా సముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది...

శర్వానంద్ 'మహా సముద్రం' వచ్చేస్తోంది...
Sanjay Kasula

|

Sep 07, 2020 | 3:19 PM

‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి చిత్రాల తర్వాత  అదే రేంజ్‌లో శర్వానంద్‌ మరోసారి మెప్పించనున్నారు. వెర్సటైల్‌ యాక్టర్‌ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం ‘మహా సముద్రం’. ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మహా సముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత దర్శకుడు అజయ్‌ భూపతి డైరెక్ట్‌ చేస్తున్న చిత్రమిది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు.

సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌బాబుతో ‘స‌రిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్‌ బ‌స్టర్‌ను నిర్మించిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇప్పుడు ‘మ‌హాస‌ముద్రం’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించనుంది. దర్శకుడు అజయ్‌ భూపతి తొలి చిత్రం ‘RX 100’తో ప్రేక్షకుల‌ను ఆశ్చర్యప‌రిచాడు. మ‌రోసారి ఆడియెన్స్‌ను అబ్బుర‌పరిచే ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశారు. ఇంటెన్స్ ల‌వ్‌-యాక్షన్ డ్రామాగా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని సుంక‌ర రామ‌బ్రహ్మం తెలుగు, త‌మిళ  రెండు భాషల్లో  చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఒక అప్‌డేట్ రానుంది.

ఇందులో శర్వానంద్‌తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్‌ కనిపించబోతున్నారని తెలుస్తోంది. కానీ ఈ విషయమై చిత్ర యూనిట్‌ ఎలాంటి ప్రకటనా ఇంతవరకు చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఓ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu