జేఎన్టీయూ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో ఛాన్స్..!

జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలలో ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలను కరోనా బారినపడ్డ విద్యార్థులు ఎలాంటి కారణం వల్లనైనా రాయకపోతే ..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో ఛాన్స్..!
Follow us

|

Updated on: Sep 07, 2020 | 6:12 PM

యూజీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలోనే జేఎన్టీయూ కాకినాడ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. (JNTU Key Decision)

జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలలో ఈ నెల 12 నుంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలను కరోనా బారినపడ్డ విద్యార్థులు ఎలాంటి కారణం వల్లనైనా రాయకపోతే .. వారికి మరో అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు.. డాక్టర్ సర్టిఫికెట్ సంబంధిత కాలేజీలలో ఇవ్వాలని సూచించారు. కాగా, వైరస్ సోకినా కూడా పరీక్ష రాసేందుకు విద్యార్థులు ముందుకొస్తే.. వారికి ప్రత్యేక గదులు కేటాయిస్తామన్నారు.

Also Read: తెలంగాణలో రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు బంద్..