తెలంగాణ శాసనసభ వాయిదా

తెలంగాణ అసెంబ్లీ మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం ప్రారంభమైన ఉభ‌య‌స‌భ‌ల్లో ఇటీవ‌ల మృతి చెందిన...

తెలంగాణ శాసనసభ వాయిదా
Follow us

|

Updated on: Sep 07, 2020 | 3:17 PM

తెలంగాణ అసెంబ్లీ మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం ప్రారంభమైన ఉభ‌య‌స‌భ‌ల్లో ఇటీవ‌ల మృతి చెందిన మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ఈ రెండు సంతాప తీర్మానాల‌ను స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా ఆమోదించి.. నివాళుల‌ర్పించారు. అటు, మాజీ స‌భ్యులు కావేటి స‌మ్మ‌య్య‌, జువ్వాడి ర‌త్నాక‌ర్ రావు, పోచ‌య్య‌, పి రామ‌స్వామి, మ‌స్కు న‌ర్సింహ‌, బి కృష్ణ‌, సున్నం రాజ‌య్య‌, ఎడ్మ కిష్టారెడ్డి, మాతంగి న‌ర్స‌య్య మృతి ప‌ట్ల స‌భ నివాళుల‌ర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత స‌భ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ శ్రీ నరసింహాచార్యులు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలికారు.