AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు అత్యాచారం, నేరపూరిత కుట్రల కింద కేసు పెట్టగలిగారు.. ఆయన భార్య రీటాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు
Balu
|

Updated on: Sep 07, 2020 | 2:25 PM

Share

ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు అత్యాచారం, నేరపూరిత కుట్రల కింద కేసు పెట్టగలిగారు.. ఆయన భార్య రీటాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దంపతులపై ఐపీసీ 376 , 506 కింద కేసులు నమోదు చేశామని చెప్పారు నెహ్రూ కాలనీ పోలీసులు.. మహేశ్‌ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఆయన కారణంగా ఓ పాపకు తల్లినయ్యానని ఓ మహిళ మొన్న 16న పోలీసులకు కంప్లయింట్‌ చేసింది.. తాను చెప్పింది అబద్ధమని భావిస్తే తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించుకోవచ్చని సవాల్‌ విసిరింది.. ఈ ఫిర్యాదు తర్వాత పోలీసులు మహేశ్‌ నేగిపై కేసు పెట్టే విషయంపై తర్జనభర్జన పడ్డారు.. ఈ ఇష్యూను ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందుకు తీసుకెళ్లింది.. పైగా రాజకీయ దుమారం చెలరేగడంతో పోలీసులు ప్రాథమిక ఆధారలు సేకరించి ఎమ్మెల్యే దంపతులపై కేసు పెట్టారు . ఇప్పటికీ తానేమీ తప్పు చేయలేదని అంటున్నారు ద్వారాహత్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే మహేశ్‌ నేగి. కాంగ్రెస్‌ పార్టీ కుట్రల కారణంగానే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని అంటున్నారు.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు.

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..