తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న భూటాన్ వాదన అబద్ధమని చెబుతోన్న తాజా శాటిలైట్ చిత్రాలు

తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న భూటాన్ వాదన అబద్ధమని తేలుతోంది. తాజా శాటిలైట్ చిత్రాలలో భూటాన్ భూభాగం రెండు కిలోమీటర్ల లోపల గ్రామంతోపాటు 9 కిలోమీటర్ల మేర రోడ్డును కూడా చైనా నిర్మించేసినట్టు వెల్లడవుతోంది. చైనీస్‌కు ఈ రోడ్డు జోంపెల్రీ రిడ్జ్‌కు ప్రత్యామ్నాయ దారిని చూపిస్తాయని భావిస్తున్నారు. మూడేళ్ల కిందట డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చైనీస్ ఈ రిడ్జ్‌ను ఆక్రమించడకుండా ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. అప్పుడు డోకా లా దగ్గర ఉన్న […]

తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న భూటాన్ వాదన అబద్ధమని చెబుతోన్న  తాజా శాటిలైట్ చిత్రాలు
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 22, 2020 | 10:34 PM

తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న భూటాన్ వాదన అబద్ధమని తేలుతోంది. తాజా శాటిలైట్ చిత్రాలలో భూటాన్ భూభాగం రెండు కిలోమీటర్ల లోపల గ్రామంతోపాటు 9 కిలోమీటర్ల మేర రోడ్డును కూడా చైనా నిర్మించేసినట్టు వెల్లడవుతోంది. చైనీస్‌కు ఈ రోడ్డు జోంపెల్రీ రిడ్జ్‌కు ప్రత్యామ్నాయ దారిని చూపిస్తాయని భావిస్తున్నారు. మూడేళ్ల కిందట డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చైనీస్ ఈ రిడ్జ్‌ను ఆక్రమించడకుండా ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. అప్పుడు డోకా లా దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీ పోస్ట్‌కు దగ్గరకి ట్రాక్‌ను విస్తరించడం ద్వారా ఈ రిడ్జ్‌ను ఆక్రమించడానికి చైనీస్ నిర్మాణ కార్మికులు ప్రయత్నించారు. ఈ రిడ్జ్ ద్వారా కీలకమైన చికెన్ నెక్ ప్రాంతంపై కన్నేసి ఉంచాలని చైనీస్ బలగాలు భావించాయి. ఈ చికెన్ నెక్ ఈశాన్య భారతాన్ని మిగతా దేశంతో కలుపుతుంది. అయితే అప్పుడా ప్రయత్నం విఫలం కావడంతో ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ టోర్సా నది తీరంలో మరో రోడ్డును చైనా నిర్మిస్తోంది. 2017లో వివాదానికి కారణమైన ప్రదేశం నుంచి ఇది కేవలం పది కిలోమీటర్లలోపే ఉంది.