ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొకైన్ కలకలం… రూ. 6 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. అడిస్ అబాబా నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ విలువు సుమారు రూ. 6 కోట్ల రూపాయలు..

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొకైన్ కలకలం... రూ. 6 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Cocaine Seized : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. అడిస్ అబాబా నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ విలువు సుమారు రూ. 6 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతడు టాంజానియా జాతీయుడిగా అధికారులు గుర్తించారు.

ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో ఉన్న లెగెజ్ బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. మాములు కొరియర్ ప్యాకింగ్‌లో కొకైన్ పౌండర్ తీసుకొస్తుండటం వారికి ఆశ్చర్యానికి గురిచేసింది.

మామూలు లగేజీలో తసుకొస్తే ఎవరూ గుర్తించరు అని నిందితుడు అనుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కొకైన్‌ను ఎక్కడికి.. ఎవరికి విక్రయించేందుకు తీసుకొస్తున్నాడు అనే కోణంలో కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.