AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం

తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ సూచన. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగానూ, ఆ తర్వాత 24 గంటల్లో తుపానుగానూ మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులిటిన్ లో ఈ మేరకు వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్‌ -మహాబలిపురం మధ్య ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని […]

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం
Venkata Narayana
|

Updated on: Nov 22, 2020 | 10:15 PM

Share

తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ సూచన. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగానూ, ఆ తర్వాత 24 గంటల్లో తుపానుగానూ మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులిటిన్ లో ఈ మేరకు వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్‌ -మహాబలిపురం మధ్య ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని దాటే అవకాశాలున్నట్లు కూడా తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులలో కురిసే అవకాశాలున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని మిగతా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Follow Us