మహమ్మారి ముగింపు కనుచూపు మేరలో కన్పిస్తోంది…. మొదటగా టీకా తానే తీసుకుంటానని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవివ్ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇజ్రాయెల్‌లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఇంకా అక్కడి రెగ్యులేటరీలు అనుమతించలేదు....
తొలి టీకా తానే తీసుకుంటాను అని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని. కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు ముందుగా తానే కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ. ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి విడత టీకాలను ఇజ్రాయెల్ బుధవారం అందుకుంది.
టెల్ అవివ్ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇజ్రాయెల్‌లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఇంకా అక్కడి రెగ్యులేటరీలు అనుమతించలేదు. అతి త్వరలోనే ఈ అనుమతులు మంజూరు అవుతాయని నెతన్యాహూ తెలిపారు.
మహమ్మారి ముగింపు కనుచూపు మేరలో కన్పిస్తోందని అభిప్రయాపడ్డారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం అంటు తెలిపారు. టీకా కోసం ఇప్పటికే ఫైజర్ సంస్థతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ సంస్థ నుంచి 80లక్షల డోసులకు ఆర్డర్ చేసింది. తొలి విడతలో భాగంగా లక్ష డోసులు బుధవారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నాయి. దీంతో పాటు మరో అమెరికా బయోటెక్ సంస్థ మోడెర్నా నుంచి ఆరు లక్షల డోసుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. జనవరి 2021లో ఆ డోసులు డెలివరీ కానున్నాయి. ఇజ్రాయెల్‌లో 3లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. బుధవారం నాటికి అక్కడ 2,932 మంది వైరస్‌కు బలయ్యారు.
జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్ అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం నుంచి అక్కడ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 90ఏళ్ల మార్గెరెట్ కీనన్ తొలి టీకా తీసుకున్నారు. అమెరికాలో త్వరలోనే ఫైజర్‌కు అనుమతులు లభించనున్నట్లు తెలుస్తోంది.