నేతాజీ పుట్టినరోజును సెలవు దినంగా ప్రకటించాలి.. బెంగాల్ సీఎం మమతా డిమాండ్.. స్వాగతించిన నేతాజీ మనవడు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసింది.
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసింది. ఈమేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించడంతో పాటు నేతాజీ జీవితంలో జరిగిన విషయాలపై తెలుసుకోవడంతో పాటు వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ప్రధానికి రాసిన లేఖలో మమతా డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్‌ను నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ సమర్ధిస్తూనే మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అదే రోజును దేశభక్తి దినోత్సవంగా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మమతా బెనర్జీ చేసిన డిమాండ్ వాస్తవమైనదని, దీనికి నేతాజీ కుటుంబంతో పాటు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతారని ఆయన పేర్కొన్నారు.