నల్గొండలో నవ్య ఆస్పత్రి సీజ్..

కరోనా సంక్షోభాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను తమ దోపిడీకి కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నాయి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలుంటే.. కనీస మానవత్వం లేకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి.

నల్గొండలో నవ్య ఆస్పత్రి సీజ్..
Follow us

|

Updated on: Aug 23, 2020 | 2:53 AM

కరోనా సమయలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా తమను కాదంటూన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను తమ దోపిడీకి కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నాయి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలుంటే.. కనీస మానవత్వం లేకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి.

అయితే ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నల్లగొండలో కరోనా బాధితుడి నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు నవ్య ఆస్పత్రిపై ఆరపణలు వెల్లువెత్తాయి. ఓ కరోనా బాధితుడి  వద్ద 12 రోజుల ట్రీట్‌మెంట్‌కు రూ. 6 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే  ఆరోపణలపై విచారణ జరిపిన డీఎంహెచ్ఓ.. నవ్య ఆస్పత్రిని సీజ్ చేశారు. కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ హెచ్చరించారు.