ఆ ‘ఆపర్చ్యునిటీ’ ఇక లేదు

వాషింగ్టన్: అంగారక గ్రహం(మార్స్)పై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఆపర్చ్యునిటీ రోవర్ కథ ముగిసిపోయింది. 15 సంవత్సరాలుగా అంగారక గ్రహానికి సంబంధించిన అనే సంకేతాలను భూమికి పంపిన ఈ రోవర్.. గతేడాది జూన్‌లో భారీ ధూళి తుఫానులో చిక్కుకుంది. ఆ తరువాత సంకేతాలు ఆగిపోగా.. రోవర్‌ను పునరుద్ధరించేందుకు వెయ్యికిపైగా కమాండ్లు ఇచ్చారు. చివరగా మంగళవారం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని అంతరిక్ష వాహకనౌక కార్యకలాపాల కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ప్రయోజనం […]

ఆ ‘ఆపర్చ్యునిటీ’ ఇక లేదు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:26 PM

వాషింగ్టన్: అంగారక గ్రహం(మార్స్)పై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఆపర్చ్యునిటీ రోవర్ కథ ముగిసిపోయింది. 15 సంవత్సరాలుగా అంగారక గ్రహానికి సంబంధించిన అనే సంకేతాలను భూమికి పంపిన ఈ రోవర్.. గతేడాది జూన్‌లో భారీ ధూళి తుఫానులో చిక్కుకుంది. ఆ తరువాత సంకేతాలు ఆగిపోగా.. రోవర్‌ను పునరుద్ధరించేందుకు వెయ్యికిపైగా కమాండ్లు ఇచ్చారు. చివరగా మంగళవారం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని అంతరిక్ష వాహకనౌక కార్యకలాపాల కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆపర్చ్యునిటీ రోవర్ కథ ముగిసిందని నాసా అధికారికంగా ప్రకటించింది.

రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానెల్‌లపై పెద్ద ఎత్తున ధూళి పేరుకుపోయి బ్యాటరీలు ఛార్జ్ అవడానికి అవకాశం లేనందునే పనిచేయడం ఆగిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చివరగా ఈ రోవర్ నుంచి గతేడాది జూన్ పదో తేదిన సంకేతాలు అందాయి. కాగా ఆపర్చ్యునిటీ స్థానంలో కొత్త రోవర్‌ను 2020కల్లా సిద్ధం చేస్తామని నాసా ప్రతినిధులు ప్రకటించారు.

అయితే 90 అంగారక రోజులు, వెయ్యి మీటర్ల ప్రయాణమే లక్ష్యంగా ఈ రోవర్‌ను శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపైకి పంపారు. అయితే అంచనాలకు మించి సేవలందించిన ఆపర్చ్యునిటీ సుమారు 45కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ఉండేదని, మానవుల మనుగడకు అక్కడ అవకాశాలు ఉన్నాయని ఈ రోవర్ సంకేతాలు పంపింది. అంగారగ గ్రహంకు సంబంధించి ఈ రోవర్ దాదాపు 2,00,000 ఫొటోలను భూమికి చేరవేసింది.

Latest Articles
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?
సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణాలు.. మహిళలకు బంపర్ ఆఫర్..
సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణాలు.. మహిళలకు బంపర్ ఆఫర్..