స్పెస్ సెంటర్‌కు బయలు దేరిన కల్పనా చావ్లా అంతరిక్ష నౌక

కల్పనా చావ్లా అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. ఆహార పదర్థాలను మోసుకుని అంతరిక్షకేంద్రానికి బయలు దేరింది. అమెరికా ఏరోస్పేస్‌ సంస్థ నార్తోర్ప్‌ గ్రుమన్‌ తయారు చేసిన ఈ అంతరిక్ష నౌకను వర్జీనియా తీరంలో...

స్పెస్ సెంటర్‌కు బయలు దేరిన కల్పనా చావ్లా అంతరిక్ష నౌక
Follow us

|

Updated on: Oct 04, 2020 | 4:37 AM

కల్పనా చావ్లా అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. ఆహార పదర్థాలను మోసుకుని అంతరిక్షకేంద్రానికి బయలు దేరింది. అమెరికా ఏరోస్పేస్‌ సంస్థ నార్తోర్ప్‌ గ్రుమన్‌ తయారు చేసిన ఈ అంతరిక్ష నౌకను వర్జీనియా తీరంలో ఉన్న నాసా వాలోప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ కేంద్రం నుంచి నిన్న(శనివారం) రాత్రి ప్రయోగించారు.

360 డిగ్రీల కోణంలో స్పేస్‌ వాక్‌ను చిత్రించే కెమెరాను, అంతరిక్షంలో పండించడానికి అవసరమైన ముల్లంగి విత్తనాలు, అక్కడివారికి మాంసం వంటి ఆహార పదార్థాలను మోసుకొని ఎస్‌ఎస్‌ కల్పనా చావ్లా అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది.

అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత సంతతి అమెరికన్‌ కల్పనా చావ్లా పేరు పెట్టిన సంగతి తెలిసిందే.  3,600 కిలోల సరకుతో ఎస్‌ఎస్‌ కల్పనా చావ్లా నౌక సోమవారం నాటికి ఐఎస్‌ఎస్‌ను చేరుతుందని అధికారులు వెల్లడించారు. 23మిలియన్‌ డాలర్లతో టైటానియంతో నిర్మించిన మహిళల శౌచాలయాన్ని కూడా అంతరిక్ష నౌక మోసుకొని వెళ్లింది.