AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 DC vs KKR “ఐపీఎల్ రుచులు” కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌-13లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ పడింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది...

IPL 2020 DC vs KKR ఐపీఎల్ రుచులు కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2020 | 3:31 AM

Share

ఐపీఎల్‌-13లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ పడింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 229 పరుగుల టార్గెట్‌ను రీచ్ అవడానికి ఢిల్లీ బౌలర్ల ధాటికి తడబడిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఇయాన్, రాహుల్ త్రిపాటి విరుచుకుపడ్డారు. చెమటలు పట్టించారు. కీలక సమయంలో వీరిద్దరి వికెట్లు పడిపోవంటంతో ఢిల్లీకి విజయం సాధ్యమైంది.

భారీ టార్గెట్‌ ఛేదనకు దిగిన కోల్‌కతాకు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ 3 పరగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. తర్వాత శుభ్‌మన్‌ గిల్‌(28/ 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్), నితీశ్‌ రాణా(58/35 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సర్లు) రాణించడంతో ఇన్నింగ్స్‌ దారిలో పడింది. అయితే ఆ తర్వాత ఇదే క్రమంలోనే వారిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆపై రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6) సైతం విఫలమయ్యారు.

వీరి తర్వాత క్రీజ్‌లో పాతుకుపోయిన మరో జోడీ మోర్గాన్‌, రాహుల్‌ మెరుపు మెరిపించారు. వీరిద్దరూ చివర్లో చెలరేగిపోయారు. వరుస సిక్సర్లతో ఢిల్లీకి వణుకుపుట్టించారు. కోల్‌కతా ఒక్కసారిగా మళ్లీ రేసులోకి రావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. దీంతో కోల్‌కతాకు విజయం ఖాయమనుకున్న సమయంలో ఢిల్లీ బౌలర్లు మళ్లీ మెరిశారు.

నోర్ట్జే వేసిన 19వ ఓవర్లో మోర్గాన్‌ ఔటవడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది. చివరి ఓవర్లో కేకేఆర్‌ విజయానికి 26 రన్స్‌ అవసరం కాగా స్టాయినీస్‌ వేసిన తొలి బంతికి త్రిపాఠి ఫోర్‌ కొట్టాడు. తర్వాతి బంతికే అతన్ని బౌల్డ్‌ చేసి ఢిల్లీ శిబిరంలో ఆనందాన్ని నింపాడు స్టాయినీస్. కీలక సమయంలో మోర్గాన్‌, రాహుల్‌ను పెవిలియన్‌ దారి పట్టిండంతో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. బౌలర్లు నోర్ట్జే, హర్షల్‌ పటేల్‌ సహకరించడంతో ఢిల్లీ సునాయాస విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 88 పరగుులు నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 38 బంతుల్లో 7 బౌండరీలు,6 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు కెప్టెన్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు పృథ్వీషా(66/41 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(38/17 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) మెరవడంతో కోల్‌కతా ముందు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన ధావన్‌(26/ 16 బంతుల్లో 2×4, 2×6), పృథ్వీ తొలి ఓవర్‌ నుంచే వేగంగా పరుగులు రాబట్టారు. వీరిద్దరూ 5 ఓవర్లలోనే 51 పరుగులు జోడించి జట్టుకు శుభారంభంను అందించారు. అనంతరం వరుణ్‌ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్‌లో ధావన్‌ భారీ షాట్‌ ఆడి ఔటవ్వగా.. ఢిల్లీ 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

ఇక కెప్టెన్‌తో జోడీ కట్టిన పృథ్వీ అద్భుతమైన షాట్లతో ఐపీఎల్ మజాను రుచి చూపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఆఫ్ సెంచరీ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని.. నాగర్‌ కోటి బోల్తా కొట్టించాడు. 13వ ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయిన షా‌.. శుభ్‌మన్‌ గిల్‌ చేతికి దొరికిపోయాడు. దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత పంత్‌తో జోడీ కట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ బౌండరీల వర్షం కురిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఇక చివర్లో ధాటిగా ఆడే క్రమంలో పంత్‌ .. రసెల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్‌ చివరి వరకూ క్రీజులో ఉండి భారీ స్కోర్‌ చేశాడు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత