ఐదు సంవత్సరాల తరువాత తమిళ్‌లోకి

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:48 PM

ఐదు సంవత్సరాల తరువాత తమిళనాట రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాని. ‘వెప్పమ్’ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాని.. ‘అహా కల్యాణం’ తరువాత ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. అలాగే ఆయన నటించిన ఏ తెలుగు చిత్రం తమిళ్‌లో డబ్ అవ్వలేదు. అయితే తాజాగా జెర్సీతో మళ్లీ కోలీవుడ్‌లోకి వెళ్లనున్నాడు నాని. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగా మొదటి పాటను తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ […]

ఐదు సంవత్సరాల తరువాత తమిళ్‌లోకి

ఐదు సంవత్సరాల తరువాత తమిళనాట రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాని. ‘వెప్పమ్’ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాని.. ‘అహా కల్యాణం’ తరువాత ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. అలాగే ఆయన నటించిన ఏ తెలుగు చిత్రం తమిళ్‌లో డబ్ అవ్వలేదు. అయితే తాజాగా జెర్సీతో మళ్లీ కోలీవుడ్‌లోకి వెళ్లనున్నాడు నాని. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగా మొదటి పాటను తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రంలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌కు కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ కూడా అక్కడివాడే కావడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌మైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ‘ఎమ్‌సీఏ’ తరువాత కాస్త వెనుకబడ్డ నాని ఈ చిత్రంతో మళ్లీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu