ఓటీటీలో నాని ‘వి’ చిత్రం…
నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'వి'. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Nani V Movie Release: నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నానికి ఇది 25వ చిత్రం కాగా.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఇది మూడో సినిమా. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరగగా.. మేకర్స్ మాత్రమే థియేటర్స్‌లోనే విడుదల చేస్తామన్నారు. అయితే కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా ఉండటం.. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘వి’ మేకర్స్‌కు దాదాపు రూ. 30 నుండి రూ. 35 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.