ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..
బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. ఇకపై వారికి కరోనా పరీక్షలు నిర్వహించబోమని ఏపీ అధికారులు వెల్లడించారు.
Corona Andhra Pradesh: బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. ఇకపై వారికి కరోనా పరీక్షలు నిర్వహించబోమని ఏపీ అధికారులు వెల్లడించారు. గతంలో అధికారులు బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణీకులను అదే బస్సుల్లో కరోనా పరీక్షలకు తీసుకెళ్లేవారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో ప్రయాణీకులను స్వాబ్ టెస్టులకు పంపడం లేదని చెప్పారు. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణీకులు నేరుగా వారి స్వస్థలాలకు వెళ్లిపోవచ్చునని అన్నారు. కాగా, స్వాబ్ టెస్టులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Also Read:
హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!
ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!
గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!