ఏపీ వైద్య విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్టైపెండ్ పంపు..

ఏపీలో వైద్య విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారి ఉపకార వేతనాన్ని(స్తైపెండ్) పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ వైద్య విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్టైపెండ్ పంపు..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 13, 2020 | 1:44 AM

Junior Doctors Stipend Increased: ఏపీలో వైద్య విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారి ఉపకార వేతనాన్ని(స్తైపెండ్) పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు ఈ పెంపు వర్తిస్తుంది.

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్ధులకు రూ. 19,589 పెంచింది. అలాగే పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు రూ. 44,075, రెండో సంవత్సరం రూ. 46,524కు పెంచింది, ఇక మూడో సంవత్సరం స్టూడెంట్స్ కు రూ. 48,973 పెంచింది. అటు సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సర విద్యార్ధులకు రూ. 48,973, సెకండియర్ విద్యార్ధులకు రూ. 51, 422, థర్డ్ ఇయర్ రూ. 53, 899 పెరిగింది. కాగా, ఎండీఎస్ తొలి సంవత్సరం విద్యార్ధులకు రూ. 44, 075, సెకండియర్ రూ. 46, 524, థర్డ్ ఇయర్ రూ. 48, 973 పెంచినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:

హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!

ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!

గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!

ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

 ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!