కరోనాకు చెక్ పెట్టేందుకు మరో ఔషధం రెడీ..!
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు రకాల ఔషధాలపై వివిధ దేశాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
Niclosamide for COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు రకాల ఔషధాలపై వివిధ దేశాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఇదే కోవలో మరో మందుపై ప్రయోగం చేసేందుకు పరిశోధకులు సిద్దమయ్యారు.
‘నిక్లోసమైడ్’ అనే నూతన ఫార్ములేషన్‌పై మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రయోగాలు చేపట్టనుంది. మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయిల్స్ కోసం దక్షిణ కొరియన్ కంపెనీ దేవూంగ్ ఫార్మాసూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీ-క్లినికల్ పరీక్షల్లో ఈ మందు మంచి ఫలితాలను సాధించినట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ పేర్కొంది. కాగా, మన దేశంలో కూడా క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతి లభించినట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సీఓఓ అర్జున్ జునేజా వెల్లడించారు.
Also Read:
హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!
ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!
గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!