నంద్యాలకు కుటుంబం ఆత్మహత్య కేసు : సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిన్న అరెస్టయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు.. నేడు బెయిలు మంజూరు అయింది.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఆదివారం అరెస్టయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు.. సోమవారం బెయిలు మంజూరు అయింది. దొంగతనం కేసులకు సంబంధించి తమ ప్రమేయం లేకున్నా.. పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు.. పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య అనంతరం.. ఆ వీడియో పోలీసులకు లభించింది. ఇంటర్నెట్‌లో కూడా వైరలయ్యింది. వెంటనే కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. కేసు నమోదు చేసి సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. అనంతరం వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు.. ఆదివారం ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు బెయిల్ రావడంపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపట్నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
Also Read :
వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం