ఆస్పత్రి నుంచి హీరో రాజశేఖర్‌‌ డిశ్చార్జి

ఆస్పత్రి నుంచి హీరో రాజశేఖర్‌‌ డిశ్చార్జి

హీరో రాజశేఖర్‌ కొవిడ్ మహమ్మారిని జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

Sanjay Kasula

|

Nov 09, 2020 | 9:00 PM

Hero Rajasekhar Corona Test Negative : హీరో రాజశేఖర్‌ కొవిడ్ మహమ్మారిని జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్‌ కరోనా బారిన పడగా, చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటినీ ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్‌ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు.

అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu