ఆయనో ట్రాఫిక్ కానిస్టేబుల్…నిత్యం విధుల్లో బిజీగా ఉంటాడు. రణగొణధ్వనుల మధ్య ఎంతో సహనంతో విధులు నిర్వర్తిస్తాడు. అందరూ సురక్షితంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలు చేరేందుకు సహకరిస్తాడు. కానీ అతడు ఇప్పుడు ఓ ప్రాణాన్ని నిలిపాడు. అబిడ్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ అంబులెన్స్ ఎదురుగా పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ ప్రాణాన్ని నిలపాలన్న అతడి ఆరాటాన్ని అందరూ ప్రశంసించారు. తాజాగా ఆ రోజు అంబులెన్స్‌లో సమయానికి ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు.
వివరాల్లోకి వెళ్తే… హయత్‌నగర్‌కు చెందిన వ్యక్తి గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స కోసం మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. అబిడ్స్-కోఠి రోడ్డులో అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కానిస్టేబుల్ బాబ్జీ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. కానిస్టేబుల్ ట్రాఫిక్‌ను నియంత్రించిన వీడియోను వృద్ధుడి కూతురు, అల్లుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రీట్మెంట్ అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవుతున్న సమయంలో కానిస్టేబుల్ బాబ్జీకి వృద్ధుడు, ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read :
వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం
పేపర్ కప్పులో టీ, కాఫీ తాగడం కూడా ప్రమాదకరమే !