నమో టీవీ కనపడుటలేదు!

ఢిల్లీ: ఎన్నికలు పూర్తైన వెంటనే నమో టీవీ వీక్షకుల డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి మాయమైంది.  ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మార్చి 26న అందుబాటులోకి వచ్చిన ఈ ఛానెల్, పూర్తికాగానే చటుక్కున కనిపించకుండా పోయింది. బీజేపీ నిధులతో నడిచిన నమో టీవీ మీద విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అది కేవలం బీజేపీ ప్రచార వాహకం అని, దానిలో ప్రధాని మోదీ ఇంటర్వ్యూలు, ర్యాలీలు, ఎన్డీఏ ప్రభుత్వ పథకాల  గురించి ప్రచారం జరుగుతుందని విపక్షాలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:50 am, Tue, 21 May 19
నమో టీవీ కనపడుటలేదు!

ఢిల్లీ: ఎన్నికలు పూర్తైన వెంటనే నమో టీవీ వీక్షకుల డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి మాయమైంది.  ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మార్చి 26న అందుబాటులోకి వచ్చిన ఈ ఛానెల్, పూర్తికాగానే చటుక్కున కనిపించకుండా పోయింది. బీజేపీ నిధులతో నడిచిన నమో టీవీ మీద విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అది కేవలం బీజేపీ ప్రచార వాహకం అని, దానిలో ప్రధాని మోదీ ఇంటర్వ్యూలు, ర్యాలీలు, ఎన్డీఏ ప్రభుత్వ పథకాల  గురించి ప్రచారం జరుగుతుందని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో..ఎలక్షన్ కమీషన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి వివరణ కోరింది. అనంతరం ధ్రువీకరించిన కార్యక్రమాలనే దానిలో ప్రసారం చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ పట్ల ఈసీ పక్షపాత వైఖరితో వ్యవహరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల పూరైన తరవాత ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. దానిలో నమో టీవీ ప్రస్తావన కూడా తెచ్చారు. నమోటీవీలో జరిగిన ప్రచారం ఓటింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఇప్పుడు ఎన్నికలు పూర్తి కాగానే దాని నిర్వహణ వృథా అని బీజేపీ భావించి ఉండొచ్చని ఎన్నికల సంఘంలోని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.