విమర్శలు పెరగడంతో..సారీ చెప్పిన వివేక్ ఒబేరాయ్

ముంబయి: నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేయాలని ప్రముఖ దర్శకుడు మధుర బండార్కర్‌ కోరారు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వివేక్ ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఐష్‌- సల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌లతో కలిసి ఉన్నారు. సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై ‘ఒపీనియన్‌ పోల్‌’ అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్‌‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. […]

విమర్శలు పెరగడంతో..సారీ చెప్పిన వివేక్ ఒబేరాయ్
Follow us

|

Updated on: May 21, 2019 | 9:31 AM

ముంబయి: నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేయాలని ప్రముఖ దర్శకుడు మధుర బండార్కర్‌ కోరారు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వివేక్ ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఐష్‌- సల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌లతో కలిసి ఉన్నారు. సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై ‘ఒపీనియన్‌ పోల్‌’ అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్‌‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. దీనికి వివేక్‌ క్యాప్షన్‌గా.. ‘హ హ.. క్రియేటివ్‌.. ఇది రాజకీయం కాదు. కేవలం జీవితం’ అని రాశారు.

దీంతో ఈ ట్వీట్ కాస్తా వివాదం అయ్యింది. ఆయన తీరుపై ఇప్పటికే నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలాతోపాటు పలువురు ప్రముఖులు మండిపడ్డారు. తాజాగా దర్శకుడు మధుర బండార్కర్‌ స్పందించారు. ‘ప్రియమైన వివేక్‌ ఒబెరాయ్‌.. నీ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఎప్పుడూ ఊహించలేదు. విమర్శకులు ఎంతకైనా తెగించి, ఎలాంటి మీమ్స్‌ అయినా చేస్తారు. కానీ బాధ్యతగల ఓ సెలబ్రిటీ అయిన మీరు మరొకరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాలి. దయచేసి క్షమించమని కోరి, ట్వీట్‌ను డిలీట్‌ చేయండి’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు పంపింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌కు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

ఇక  విమర్శలు తీవ్రత పెరుగుతుండటంతో  వివేక్ ఒబేరాయ్ స్పందించాడు. తన ట్వీట్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్లకు క్షమాపణలు తెలిపాడు. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ డిలీట్ చేసినట్టు తెలిపాడు.కొన్ని సార్లు మనకి సరదాాకా, హాని కలిగించనవి అనిపించేవేవి..మిగతా వాళ్లకు తప్పుగా తోచొచ్చు అని చెప్పాడు. గత 10 సంవత్సరాల నుంచి 2000 మందికి పైగా అమ్మాయిల ఉన్నతికి కృషి చేశానని..ఆడాళ్లను అగౌరవపరచడం తన అభిమతం కాదంటూ ట్వీట్ చేశాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు