Namaste Trump: ట్రంప్ దంపతుల వెంట భారత సంతతి మహిళ.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ప్రపంచమెరిగిన ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య కనిపించిన భారతీయ మహిళ ఎవరూ అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. 

Namaste Trump: ట్రంప్ దంపతుల వెంట భారత సంతతి మహిళ.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: Feb 25, 2020 | 8:38 PM

Namastey Trump: నిన్న ఉదయం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులను ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ఆ దంపతుల వెన్నంటే వచ్చిన ఓ భారతీయ మహిళ కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. ప్రపంచమెరిగిన ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య కనిపించిన ఆ మహిళ ఎవరూ అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

Also Read: ట్రంప్ బస చేసిన హోటల్ రూమ్ ఖర్చు ఎంతంటే..?

ఆమె పేరు గురుదీప్ చావ్లా. అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ. ఆమెకు ట్రాన్స్‌లేటర్‌గా 27 ఏళ్ళ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనువాదకురాలిగా పని చేస్తున్నారు. ఒక్క పీఎం మోదీనే కాదు.. గతంలో వీపీ సింగ్, చంద్రశేఖర్, నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌ల వద్ద కూడా పని చేశారు.

Also Read: Here Are The Details Of YSR Jagananna Vasathi Deevena

1990లో గురుదీప్ చావ్లా ఇండియన్ పార్లమెంట్‌లో అనువాదకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పుడు ఆమె వయసు 21. 2015 రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా బరాక్ ఒబామాకు  కూడా ఆమె ట్రాన్స్‌లేటర్‌గా పని చేశారు. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లినా ఆమె ఆయన వెంటే ఉంటారు. ఆయన హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇంగ్లీష్‌‌లోకి అనువదించి ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులకు వివరిస్తారు.

Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

మరోవైపు గతంలో భారత పర్యటనకు విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కూడా గురుదీప్ సేవలు అందించారు. ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశం, మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఈవెంట్, విదేశాంగ మంత్రుల మండలి భేటీ వంటి కీలక సమావేశాల్లో ప్రధాని భాషను ఈమె అనువదించారు. కాగా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయంలో ట్రంప్, మెలానియా ట్రంప్, నరేంద్ర మోదీలతో గురుదీప్ చావ్లా రెడ్ కార్పెట్‌‌లో నడిచిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.