Trump India Visit: ట్రంప్ బస చేసిన హోటల్ రూమ్ ఖర్చు ఎంతంటే..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా యావత్తు దేశం సాదరంగా స్వాగతం పలికింది. ఆయన బస చేసిన హోటల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Trump India Visit: ట్రంప్ బస చేసిన హోటల్ రూమ్ ఖర్చు ఎంతంటే..?
Follow us

|

Updated on: Feb 25, 2020 | 3:21 PM

Trump India Visit: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా యావత్తు దేశం సాదరంగా స్వాగతం పలికింది. అగ్రరాజ్యం అధినేత హోదాకు తగ్గట్టు ఆకట్టుకునే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రెండవ రోజు పర్యటనను బిజీబిజీగా కొనసాగిస్తున్న ట్రంప్ బస చేసిన హోటల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

నిన్న రాత్రి ట్రంప్ దంపతులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో బస చేశారు. ఒక రాత్రి కోసం వారికి ఆ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్ చేయగా.. ఆ గదికి ఒక రోజు అద్దె అక్షరాల 8 లక్షల రూపాయలు. ఇక ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘పెద్దన్న అంటే మాటలా.. ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలాగంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Here Are The Details Of YSR Jagananna Vasathi Deevena

గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రత్యేకతలు…

సిల్క్‌ ప్యానెల్డ్‌ గోడలు, ఉడెన్ ఫ్లోరింగ్, విశాలమైన లివింగ్ రూమ్, ప్రత్యేకమైన డైనింగ్ హల్, రెస్ట్‌రూమ్, మినీ స్పా, పర్సనల్ జిమ్‌తో సహా అదిరిపోయే కళాఖండాలు ఈ సూట్‌లో ఉంటాయి. అత్యంత సౌకర్యవంతమైన ఈ గదిలో స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్లర్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ గ్రాండ్ ప్రెసిడెన్షియల్‌ సూట్‌‌లో నాటి అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్‌ క్లింటన్, జార్జ్‌ బుష్‌లు బస చేశారు.

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi