Jagananna Vasathi Deevena: జగనన్న వసతి దీవెన‌కు అర్హులో కాదో ఆన్లైన్‌లో తెలుసుకోండిలా..!

పేద విద్యార్థుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందించనుంది...

Jagananna Vasathi Deevena: జగనన్న వసతి దీవెన‌కు అర్హులో కాదో ఆన్లైన్‌లో తెలుసుకోండిలా..!
Follow us

|

Updated on: Feb 25, 2020 | 3:30 PM

YSR Jagananna Vasathi Deevena: పేద విద్యార్థుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందించనుంది. వసతి, భోజనం ఖర్చుల నిమిత్తం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బును వారి తల్లుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం సుమారు 11,87,904 మంది విద్యార్థులకు వర్తించనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.2,300 కోట్లు ఖర్చు చేయనుంది.

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi

Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

అర్హులు ఎవరంటే…

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో పాలిటెక్నీక్, ఐటీఐ, డిగ్రీ.. ఆపై చదువులు చదివేవారు ఈ పథకానికి అర్హులు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. కరెస్పాండెన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు చదివేవారు అనర్హులు. అలాగే మేనేజ్‌మెంట్, స్పాట్ కోటాలో చదివారు కూడా అర్హులు కాదు. ఈ పథకం వర్తించాలంటే విద్యార్థుల కుటుంబాల వార్షిక ఆదాయం రెండున్నర లక్షలు, అంతకన్నా తక్కువ కలిగి ఉండాలి.

అటు విద్యార్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్‌దారులు ఉంటే వారు అనర్హులు. కుటుంబంలో ఐటీ రిటర్న్స్ చెల్లించేవారు ఉన్నా ఈ పథకానికి అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్నవారు ‘జగనన్న వసతి దీవెన’ అర్హులు.

Also Read: Netflix Amazing Offer For New Users. Rs 5 Month Subscription 

దరఖాస్తు చేసుకునే విధానం…

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రెసిడెన్షియల్ ప్రూఫ్, అడ్మిషన్ డాక్యుమెంట్, హాస్టల్ ఫీజ్ కట్టిన పేపర్లు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, బిలో పావర్టీ లైన్, ఎకనామికల్లి వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కోసం ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడండి.

ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు…

‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు.. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు రూ.20 వేల అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ, అంగవైకల్యం ఉన్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.