హస్తినలో కిరణ్ బిజీ బిజీ.. హుటాహుటిన ఢిల్లీకి సోము.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ..
ఒకవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఢిల్లీ పెద్దలను కలవడం, అదే టైమ్‌లో సోము వీర్రాజుకి పిలుపురావడంతో ఏపీ బీజేపీలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా అనే చర్చ మొదలైంది.
బీజేపీలో చేరి 24గంటలు కూడా కాలేదు, కానీ ఏపీ బీజేపీలో సంచలనం రేపుతున్నారు నల్లారి కిరణ్‌కుమారెడ్డి. ఢిల్లీలో వరుసగా పార్టీ పెద్దలను కలుస్తూ ఆంధ్రా కాషాయదళంలో కలకలం సృష్టిస్తున్నారు. ఒకేరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరో అగ్రనేత బీఎల్ సంతోష్‌ను కలవడం ఇప్పుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉదయం, అమిత్‌షా, నడ్డాను కలిసిన నల్లారి…. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో డిన్నర్‌కి అటెండ్ అయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు
ఒకవైపు, ఢిల్లీలో నల్లారి భేటీలు జరుగుతుండగానే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి పిలుపు రావడం మరింత సంచలనంగా మారింది. ఉన్నఫళంగా ఢిల్లీ రావాలంటూ పార్టీ పెద్దల నుంచి ఆర్డర్ రావడంతో హుటాహుటినా హస్తినకెళ్లారు సోము. మూడు రోజుల పాటు సోము ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై కూడా సోము వీర్రాజు అభిప్రాయాన్ని తీసుకునేందుకే పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఒకవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఢిల్లీ పెద్దలను కలవడం, అదే టైమ్‌లో సోము వీర్రాజుకి పిలుపురావడంతో ఏపీ బీజేపీలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా అనే చర్చ మొదలైంది.