చెర్వుగట్టులో మూడు రోజులపాటు దర్శనాలు బంద్
కరోనా ప్రభావం దేవాలయాలపై కొనసాగుతూనే ఉంది. కొవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా సామూహిక కార్యక్రమాల్లో జనం ఎక్కువ సంఖ్యలో పాల్గొనకుండా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా చెర్వుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించమని స్పష్టం చేసింది. ప్రతి అమావాస్య రోజు చెర్వుగట్టు […]
కరోనా ప్రభావం దేవాలయాలపై కొనసాగుతూనే ఉంది. కొవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా సామూహిక కార్యక్రమాల్లో జనం ఎక్కువ సంఖ్యలో పాల్గొనకుండా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా చెర్వుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించమని స్పష్టం చేసింది. ప్రతి అమావాస్య రోజు చెర్వుగట్టు ఆలయానికి సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తుంటారు. ఆరోజు ఆలయం వద్ద నిద్ర చేస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ క్రమంలో ఒకేసారి అంతమంది భక్తులు గుమిగూడితే కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రావణమాసానికి తోడు అమావాస్య ఆగస్టు 19న వస్తుంది. దీంతో ఈ మూడు రోజులు భక్తులను అనుమతించబోమని పాలక మండలి తెలిపింది. నిత్య కైంకర్య సేవల కోసం కేవలం పూజారులు మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 21 నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ కరోనా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు.