Child Ghost: రోడ్డుపై పరుగులు తీసిన ‘దెయ్యం’.. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసు.. చివరికి ఏం జరిగిందంటే..
Child Ghost: దెయ్యం ఉందా? లేదా? అని అడిగితే.. కొందరు ఉందంటారు? మరికొందరు లేదంటారు? ఇంకొందరైతే అంతా మీ వెర్రి..
Child Ghost: దెయ్యం ఉందా? లేదా? అని అడిగితే.. కొందరు ఉందంటారు? మరికొందరు లేదంటారు? ఇంకొందరైతే అంతా మీ వెర్రి అన్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ పక్కకు వెళ్లిపోతారు. అయితే, తాజాగా అమెరికాలోని ఓహియోలో జనాలను ఓ చిన్నారి దెయ్యం హడలెత్తిస్తోంది. రాత్రి అవగానే చాలు.. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ అరుస్తూ వెళ్తుందట. ఒక్కోసారి పరుగులు తీస్తుందట. దానిని గమనించిన పలువురు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొందరు అసలేం జరుగుతుందని తెలుసుకోవడానికి సిసి కెమెరాలను పరిశీలించగా.. నిజంగానే ఆ కెమెరాలో చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా నీడ కనిపిస్తోంది. డోర్ బెల్ సెక్యూరిటీ కెమెరాలో ఆ చిన్నారి దెయ్యం కదలికలు రికార్డ్ అయ్యాయి. అది చూసిన ఓహియో ప్రజలు మరింత జడిసిపోతున్నారు. మరోవైపు ఈ దెయ్యానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘మీరు దెయ్యాలను, ఆత్మలను నమ్ముతారా? లేదా?’ అంటూ క్యాప్షన్ పెట్టి.. నెట్టింట్లోకి ఆ వీడియోను వదిలేశారు. ఆ వీడియోలో ఇప్పుడు లక్షలాది మంది చూస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఒహియోలోని మెంటార్ ప్రాంతంలో రాత్రి సమయంలో ఏడేళ్ల చిన్నారి అర్థరాత్రి వేళ వీధుల వెంట పరుగులు పెడుతూ వెళ్తుందట. ఈ ఘటన అంతా ఓ ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అదిచూసిన ఆ ఇంటి యజమాని హడలిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు. ‘ఏడు సంవత్సరాల వయసు ఉండే ఓ చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా చూశాను. మా డోర్‌బెల్ కెమెరాలో ఈ చిన్నారి పరుగులకు సంబంధించి వీడియో రికార్డ్ అయ్యింది.’ అంటూ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే ఆ పోలీసు అధికారి ఘటనా ప్రాంతంలోకి వెళ్లి పరిశీలించాడు. ముందుగా వీడియోను పరిశీలించారు. ఆ తరువాత అతనికి కూడా ఓ చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపించింది. అయితే మరింత క్షుణ్ణంగా పరిశీలిద్దామని ఆ పోలీసు అధికారి తన కారులోంచి కిందకు దిగి ఆ చిన్నారిని చేరుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అదృశ్యమైపోయింది.
దాంతో ఆ పోలీసు అధికారి కూడా షాక్ అయ్యాడు. తనకు భయపడి చిన్నారి పారిపోయి ఉంటుందని భావించి ఆ ప్రాంతం గాలించాడట. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందట. ఇదే విషయాన్ని ఆ పోలీసు అధికారి తన ఉన్నతాధికారులకు నివేదించాడు. కాగా, చిన్నారి ఎవరా? అని తెలుసుకునేందుకు డాగ్‌స్క్వాడ్‌తో పాటు.. డ్రోన్ బృందం కూడా రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దాంతో ఈ కేసును మిస్టరీగా పరిగణించి విచారణ చేపడుతున్నారు. మరోవైపు చిన్నారి రూపంలో రాత్రి పూట సంచరించేది దెయ్యమే అని స్థానిక జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో హడలిపోతున్నారు కూడా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
Credits: Infor Viral Fun
Also read: