AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థిరాస్తి వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చేలా పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు

రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుస్థులకు ప్రొత్సాహం అందించే విధంగా తెలంగాణ పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

స్థిరాస్తి వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చేలా పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2020 | 10:39 AM

Share

రాష్ట్రంలోని స్థిరాస్తి వ్యాపారుస్థులకు ప్రొత్సాహం అందించే విధంగా తెలంగాణ పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  నగరాలు, మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతుల రుసుం, ఇతర ఛార్జీలను నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.  వివిధ నిర్మాణ సంఘాల వినతి మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. భవన నిర్మాణ అనుమతుల ఫీజు, బెటర్‌మెంట్‌ ఛార్జీలు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, క్యాపిటలైజేషన్‌ ఛార్జీలు అన్నింటిని నాలుగు అర్థసంవత్సరం వాయిదాల్లో కట్టేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు.

 మొదటి వాయిదాను మాత్రం అనుమతి పొందినట్లు సమాచారం లేఖ అందిన 30 రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. డెవలపర్‌, బిల్డర్ ఒకేసారి చెల్లింపునకు ముందుకు వస్తే భవన నిర్మాణ/లేఅవుట్‌ అనుమతి ఛార్జీల్లో ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తారు. నిర్దేశించిన వాయిదాల్లో పోస్ట్‌డేటెడ్‌ చెక్‌లు ఇచ్చిన మేరకు మిగిలిన మొత్తాన్ని చెల్లించడంలో ఫెయిల్ అయితే  ఆలస్యానికి 12శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు స్వీకరించే దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

భవన నిర్మాణ అనుమతుల సమయంలో పురపాలక, నగరపాలక సంస్థలకు మార్టిగేజ్‌ చేసే 10శాతం బిల్డప్‌ ఏరియాకు రిజిస్టేషన్‌ అవసరంలేదని పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ చేయకుండా 10శాతం బిల్డప్‌ ఏరియాను మార్టిగేజ్‌ చేస్తున్నట్లు నోటరీ ఆఫిడవిట్‌ ఇస్తే చాలని పేర్కొంది. ఈ ఆఫిడ్‌విట్‌లను పురపాలక కమిషనర్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమైన తరువాత రిజిస్ట్రేషన్‌ శాఖకు ఇచ్చి వాటిని నిషేధిత ఆస్తులు లిస్ట్‌లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read :

స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

కాజల్ హనీమూన్‌పై ట్రోలింగ్ !