AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians: 6 ఓటముల తర్వాత కూడా ముంబై ప్లేఆఫ్ చేరే ఛాన్స్.. ఇదిగో టాప్-4లోకి వెళ్లే రూట్..!

Mumbai Indians Playoff Qualification: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, అభిమానులకు ఒక చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. గణాంకాల ప్రకారం ముంబై ఇప్పటికీ ప్లేఆఫ్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆ సమీకరణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Mumbai Indians: 6 ఓటముల తర్వాత కూడా ముంబై ప్లేఆఫ్ చేరే ఛాన్స్.. ఇదిగో టాప్-4లోకి వెళ్లే రూట్..!
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Apr 30, 2026 | 7:32 PM

Share

Mumbai Indians Playoff Qualification: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు. బలహీనమైన బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్లు ఉన్నప్పటికీ, పవర్‌ప్లేలో పరుగులు నియంత్రించలేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్ దారి అత్యంత కఠినంగా మారింది.

బ్యాటింగ్ లో మెరుపులు ఉన్నా నిలకడ లేదు..

హైదరాబాద్‌పై జరిగిన పోరులో రియాన్ రికెల్టన్ 123 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించి జట్టుకు కొండంత స్కోరు అందించారు. ఇది ముంబైకి దక్కిన సానుకూల అంశం అయినప్పటికీ, ఇతర అగ్రశ్రేణి ఆటగాళ్ల నుండి సరైన సహకారం అందడం లేదు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులు కీలక సమయాల్లో రాణించలేకపోతున్నారు. సీజన్ అంతటా బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం జట్టును వరుస ఓటములకు గురిచేస్తోంది.

ప్లేఆఫ్ చేరాలంటే ఉండాల్సిన సమీకరణాలు..

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా మైనస్‌లో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై తన తదుపరి ఆరు మ్యాచ్‌లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు గెలిస్తే 16 పాయింట్లు సాధించి టాప్-4లో చోటు దక్కించుకోవచ్చు. కానీ ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిబాట పట్టక తప్పదు.

ఇవి కూడా చదవండి

ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం తప్పదు..

ముంబై కేవలం తన మ్యాచ్‌లు గెలవడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. భారీ తేడాతో విజయాలు సాధించడం ద్వారా నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం అత్యవసరం. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ముంబైకి నాకౌట్ లాంటిదే. ఒకవేళ ఇక్కడి నుంచి ముంబై పుంజుకుని ప్లేఆఫ్ చేరితే, అది ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన పునరాగమనంగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us