మరో ‘బిగ్’ డీల్ కుదర్చుకోబోతున్న రిలయన్స్
కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ భారత కుబేరుడు అంబానీ మాత్రం వ్యాపారంలో దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రం భారీ ఒప్పందాలతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ముఖేష్ అంబానీ గ్రూప్ లో భాగమైన జియోకు సంబంధించిన వాటాలను అమ్మేసుకున్నారు. ఇలా అమ్మకాలే కాదు, మరోవైపు అంబానీ భారీ కొనుగోలు కూడా చేస్తున్నారు.

ఇండియాలో భారీ రీటైల్ మార్కెట్ ను కలిగి ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ను ముఖేష్ అంబానీ పూర్తిగా సొంతం చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దేశీయ రిటైల్ రంగం మరో భారీ ఒప్పందానికి వేదిక కాబోతున్నది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీకి చెందిన రిటైల్ వ్యాపారాన్ని సైతం ముకేశ్ అంబానీ కొనుగోలు చేయబోతున్నాడు. ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ 24 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్ల వరకు(3.2-3.6 బిలియన్ డాలర్ల) ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని ఇచ్చే పత్రికలు పేర్కొంటున్నాయి.
బిగ్‌బజార్, ఫుడ్‌ధాల్, బ్రాండ్ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్ గ్రూపు రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే, ఇప్పటికే రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ దేశవ్యాప్తంగా 12 వేల స్టోర్లు నిర్వహిస్తోంది. రిటైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్ అంబానీ ఫ్యూచర్ గ్రూపును సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టెలికం విభాగం జియోలోకి పెట్టుబడులు వరదలా రావడంతో ఈ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే రీటెయిల్ మార్కెట్ లోకి రిలయన్స్ ఎంటరయ్యింది. ఫ్యూచర్ గ్రూప్ డీల్ ద్వారా రీటెయిల్ మార్కెట్ లో పెద్ద శక్తిగా మారుతోంది.