అప్పుడు రజినీకాంత్‌కి.. ఇప్పుడు తుమ్మలకి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు వేశారు. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో స్థానిక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. అయితే.. ఎన్నికల సిబ్బంది తుమ్మల ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి సిరా గుర్తు వేశారు. కాగా.. తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ […]

అప్పుడు రజినీకాంత్‌కి.. ఇప్పుడు తుమ్మలకి..
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 2:06 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు వేశారు. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో స్థానిక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. అయితే.. ఎన్నికల సిబ్బంది తుమ్మల ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి సిరా గుర్తు వేశారు. కాగా.. తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కుడి చేతికి వేలికి సిరా గుర్తు వేయడంతో.. ఈసీ అక్కడి సిబ్బందిని సస్పెన్షన్‌ చేసింది. మరి ఇప్పుడేమవుతుందో చూడాలి.