భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. అపాచీ అటాక్ హెలికాప్టర్‌ను అమెరికా నేడు అధికారికంగా భారత వైమానికదళానికి అప్పగించింది. ఈ హెలికాప్టర్‌పు భారత వైమానిక దళం తరఫున ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా స్వీకరించారు. భారత వాయుసేనలో ఇదే తొలి అపాచీ కావడం విశేషం. ఈ విషయాన్ని ఐఏఎఫ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం.. ఆ దేశ ప్రభుత్వం, బోయింగ్‌తో 2015 […]

భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. అపాచీ అటాక్ హెలికాప్టర్‌ను అమెరికా నేడు అధికారికంగా భారత వైమానికదళానికి అప్పగించింది. ఈ హెలికాప్టర్‌పు భారత వైమానిక దళం తరఫున ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా స్వీకరించారు. భారత వాయుసేనలో ఇదే తొలి అపాచీ కావడం విశేషం. ఈ విషయాన్ని ఐఏఎఫ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
అయితే అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం.. ఆ దేశ ప్రభుత్వం, బోయింగ్‌తో 2015 సెప్టెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై నాటికి తొలి విడత హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. కాగా అపాచీ హెలికాప్టర్లకు గాలిలో, భూమి మీద దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది.



