నేటితో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం నేటితో ముగియనుంది. మొత్తం 427 మంది ఎంపీపీలు, 6,473 మంది ఎంపీటీసీలు తమ ఐదేళ్ల పదివీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇక గురువారం నుంచి మండలాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే పాతసభ్యుల పదవీకాలం ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నాలుగు పర్యాయాలు జరిగినప్పటికీ.. పదవీకాలం ముగియకముందే ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు లేవు. పదవీ కాలం ముగిశాక ఆరు నెలలకో, ఏడాదికో ఎన్నికలు […]

నేటితో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం పూర్తి
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 10:28 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం నేటితో ముగియనుంది. మొత్తం 427 మంది ఎంపీపీలు, 6,473 మంది ఎంపీటీసీలు తమ ఐదేళ్ల పదివీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇక గురువారం నుంచి మండలాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే పాతసభ్యుల పదవీకాలం ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నాలుగు పర్యాయాలు జరిగినప్పటికీ.. పదవీకాలం ముగియకముందే ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు లేవు. పదవీ కాలం ముగిశాక ఆరు నెలలకో, ఏడాదికో ఎన్నికలు జరిగేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక మండలాల్లో కొలువుదీరనున్న తొలి పాలకవర్గాలుగా గురువారం బాధ్యతలు స్వీకరించేవారు రికార్డులకెక్కనున్నారు.

ఇక గురువారం కొన్ని జిల్లాల్లోని ఎంపీపీలు మినహా రాష్ట్రంలోని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. అదే రోజున తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఆ తేదీనుంచే వీరి పదవీకాలం మొదలై.. ఐదేండ్లు కొనసాగనున్నది. కొత్త ఎంపీపీలతోపాటు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం కూడా అధికారికంగా మొదలువుతున్నది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తమ స్థానాల్లో కూర్చోడానికి ముందే ఎంపీటీసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు ఆగస్టు 6న పదవుల్లోకి రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 539 మండలాలకు గాను.. ములుగు జిల్లా మంగపేటలో ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 538 మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తిచేశారు.