AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరవ్ మోదీకి బిగ్ షాక్.. రూ. 44.41 కోట్లు జప్తు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. పీఎన్‌బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ ఈడీకి సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మోహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ […]

నీరవ్ మోదీకి బిగ్ షాక్.. రూ. 44.41 కోట్లు జప్తు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 03, 2019 | 10:18 AM

Share

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. పీఎన్‌బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ ఈడీకి సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మోహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ. 44.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్‌ మోదీకి స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. గతేడాది జనవరిలో దొంగచాటున విదేశాలకు పారిపోయిన నీరవ్‌ని ఇటీవల లండన్‌లో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Follow Us
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్