AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Story of Ambica IPS: 14ఏళ్లకు పెళ్లి , 18ఏళ్లకు పిల్లలు అయినా లక్ష్యాన్ని సాధించించిన లేడీ సింగమలై గురించి తెలుసా..!

కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించాలేది లేదని నిరూపించిందో మహిళ. 14ఏళ్లకు ఒక పోలీసుతో పెళ్లి .. 18 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది...

The Story of Ambica IPS: 14ఏళ్లకు పెళ్లి , 18ఏళ్లకు పిల్లలు అయినా లక్ష్యాన్ని సాధించించిన లేడీ సింగమలై గురించి తెలుసా..!
Surya Kala
|

Updated on: Jan 24, 2021 | 10:12 AM

Share

The Story of Ambica IPS: కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించాలేది లేదని నిరూపించిందో మహిళ. 14ఏళ్లకు ఒక పోలీసుతో పెళ్లి .. 18 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. తన చదువుకు భవిష్యత్ కు పెళ్లి, పిల్లలు బాధ్యతలు ఏవీ అడ్డు కావని నిరూపించారు .. తన భర్త కుటుంబం సహకారం తో ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ గా లేడీ సింగంగా ఈ రోజు దేశ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు.

అంబికకు 14 ఏళ్లకే పోలీస్ ఉద్యోగితో వివాహం జరిగింది. 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లికూడా అయ్యారు. అయితే ఓ రోజు అంబికా రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెల్లారు. ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని..10వ తరగతి కూడా చదవని అంబికకు నచ్చ చెప్పడానికి చూశాడు. ఐపిఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంతకష్టమైనా ఐపీఎస్ కావాలని కోరుకున్నారు.

దీంతో అంబిక భర్త ఆమెను ఓ ప్రైవేట్ కోచింగ్ కు పంపించాడు అలా 10 వ తరగతి పాస్ అయ్యారు. అనంతరం ఇంటర్, డిగ్రీకూడా పూర్తి చేశారు. అయితే అంతటితో అంబిక తృప్తీ పడలేదు.. సివిల్స్ కు ప్రిపేర్ కావడానికి రెడీ అయ్యారు. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్‌కు సివిల్ సర్వీస్ పరీక్షా కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్ధం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచించి కు చెన్నై పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి, పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

అయితే అంబికా సివిల్స్ లో రెండో సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబిక ను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు.. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించాలని భావించారు. రెట్టింపు కష్టపడి.. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్… ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. 2008 లో ఐపిఎస్ కు అంబిక ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ‘ముంబాయి సివంగి’ అని లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవాతత్పరతకు గుర్తింపుగా ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్- 2019’ పురస్కారాన్ని అందుకున్నారు అంబిక. జీవిత కథ కచ్చితంగా కొంత మంది జీవితాలకైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అనేక మార్పులు తెస్తుందని చెప్పవచ్చు…

Also Read: రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం.. ఏఏ దేశాల చట్టాలను ప్రామాణికంగా తీసుకున్నారో తెలుసా..!