ప్రాణం అంటే ఓటు కాదోయ్, ప్రాణం అంటే వ్యాక్సినోయ్ అని మేము అంటున్నాం : ఏపీ పోలీస్ అధికారులు సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రహసనంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి...

ప్రాణం అంటే ఓటు కాదోయ్, ప్రాణం అంటే వ్యాక్సినోయ్ అని మేము అంటున్నాం : ఏపీ పోలీస్ అధికారులు సంఘం
Follow us

|

Updated on: Jan 23, 2021 | 6:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రహసనంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్ఈసీ నిర్ణయానికి ఏపీలోని ఉద్యోగ సంఘాలతోపాటు, తాజాగా ఏపీ పోలీస్ అధికారులు సంఘం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని అనేక సార్లు కోరామని, కరోనా కారణంగా పొలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీస్ అధికారుల సంఘం చెప్పుకొస్తోంది. అంతేకాదు, “కరోనా కారణంగా అనేక మంది పోలీసులు మృతి చెందారు, మరింత మంది కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్నారు. త్వరలో పోలీసులకు వ్యాక్సినేషన్ ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకుంటున్నాం” అని పోలీస్ అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో వ్యాక్సినేషన్ సమయంలో ప్రధానమంత్రి స్వయంగా పలికిన మహాకవి గురజాడ అప్పారావు కవితను వల్లెవేస్తున్నారు. “దేశమంటే మట్టి కాదోయ్…. దేశమంటే మనుషులోయ్ అని ప్రధాని అన్నారు. ప్రాణం అంటే ఓటు కాదోయ్, ప్రాణం అంటే వ్యాక్సినోయ్ అని మేము అంటున్నాం.” అని పోలీస్ అధికారుల సంఘం నేతలు సెలవిస్తున్నారు.