విషాదం: గుంటూరులో తల్లి, కుమార్తె మృతి
గుంటూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి, తన కుమార్తెతో కలిసి అపార్టుమెంట్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

గుంటూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి, తన కుమార్తెతో కలిసి అపార్టుమెంట్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలా చనిపోయారన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు లక్ష్మీపురంలోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న వివాహిత శనివారం తన కుమార్తెతో సహా భవనంపై నుంచి కింద పడిపోయారు. దీంతో తల్లి, కూతురు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల తల్లి మనోజ్ఞ, కూతురు తులసిగా ఐడెంటిఫై చేశారు. అయితే తల్లి, బిడ్డ అనుకోకుండా భవనంపై నుంచి స్లిప్పై పడిపోయారా? సూసైడ్ చేసుకున్నారా? లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
తమ్ముని పేరుతో అన్న ప్రభుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు
