తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

ఇప్పుడు చెప్ప‌బోయే జాదూగాడు మాములు తెలివైనోడు కాదు. త‌మ్ముడి స‌ర్టిఫికేట్స్‌ ఉప‌యోగించి విద్యుత్ శాఖ‌లో జాబ్ తెచ్చుకుని..ఏకంగా 12 ఏళ్లుగా ఎంచక్కా కొలువు చేస్తున్నాడు.

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం,  ఏకంగా 12 ఏళ్లు
Follow us

|

Updated on: Aug 29, 2020 | 7:28 AM

ఇప్పుడు చెప్ప‌బోయే జాదూగాడు మాములు తెలివైనోడు కాదు. త‌మ్ముడి స‌ర్టిఫికేట్స్‌ ఉప‌యోగించి విద్యుత్ శాఖ‌లో జాబ్ తెచ్చుకుని..ఏకంగా 12 ఏళ్లుగా ఎంచక్కా కొలువు చేస్తున్నాడు. ఇద్ద‌రి ముఖ క‌వ‌ళిక‌‌లు ఒకేలా ఉండ‌టంతో ఇన్నేళ్లుగా పెద్ద‌గా ఎవ‌రికీ డౌబ్ట్ రాలేదు. తాజాగా సోద‌రుడే ఎన్పీడీసీఎల్‌ విజిలెన్సు విభాగానికి కంప్లైంట్‌ చేయడంతో బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రవీందర్‌, గాదె రాందాస్ అన్న‌దమ్ములు. పన్నెండేళ్ల క్రితం మంథని సబ్‌స్టేషన్‌లో తాత్కాలిక ఎంప్లాయిగా వ‌ర్క్ చేసిన‌ రవీందర్ ప‌ర్మనెంట్‌ ఉద్యోగం కోసం తమ్ముడు రాందాస్‌ ఐటీఐ సర్టిఫికెట్‌లను వినియోగించాడు. అదే పేరుతో జాబ్ చేస్తూ ప్ర‌మోష‌న్స్ పొందుతూ వచ్చాడు. ప్రస్తుతం గోదావరిఖని తూర్పు డివిజన్‌లో లైన్‌మెన్‌(ఆపరేటర్‌)గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆస్తి విష‌యంలో సోద‌రుల మధ్య విబేధాలు త‌లెత్త‌డంతో.. తన ధ్రువపత్రాలతో జాబ్ చేస్తున్నట్లు రాందాస్‌ కొంతకాలం క్రితం పోలీసులకు కంప్లైట్‌ చేశాడు. స్పందన రాకపోవడంతో సమాచార హ‌క్కు చట్టం కింద వివరాలు సేకరించి ఎన్పీడీసీఎల్‌ విజిలెన్సు విభాగానికి ఫిర్యాదు చేశాడు. విజిలెన్సు అధికారుల విచారణలో అస‌లు విష‌యం తెలియ‌డంతో మూడు నెలల క్రితం రవీందర్‌ను సస్పెండ్‌ చేశారు. 12 ఏళ్లుగా రాందాస్‌ పేరుతో జాబ్ చేస్తున్న అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్‌ తెలిపారు.

Also Read : ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్​

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?