రాజ్ నాథ్ కోసం రష్యా వెయిటింగ్.. !

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు భారత్ - రష్యా ఎంతటి మిత్రదేశాలో తెలియంది కాదు. మారిన పరిస్థితులకు తగ్గట్టు కొంత కాలంగా మళ్లీ రష్యాతో భారత్ అనేక విషయాల్లో..

రాజ్ నాథ్ కోసం రష్యా వెయిటింగ్.. !
Follow us

|

Updated on: Aug 29, 2020 | 5:31 PM

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు భారత్ – రష్యా ఎంతటి మిత్రదేశాలో తెలియంది కాదు. మారిన పరిస్థితులకు తగ్గట్టు కొంత కాలంగా మళ్లీ రష్యాతో భారత్ అనేక విషయాల్లో కలిసి ముందుకు సాగుతోంది. తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారం మాస్కోలో పర్యటించబోతున్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలవడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భారత్ తమకు ఎప్పటికీ మంచి మిత్రదేశమన్నారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ‘ఇండియన్ డిఫెన్స్ పెవిలియన్’ కు షోయిగు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాస్కో నగరం వెలుపలనున్న కుబింకా ప్రాంతం దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ సందర్బంగా రష్యాలోని భారత రాయభారి వెంకటేష్ వర్మ రష్యా రక్షణ మంత్రి హెచ్ఇ సెర్గీ షోయిగుకు ఘన స్వాగతం పలికారు. కాగా, సెప్టెంబర్ 4 నుండి 6వతేదీ వరకు రష్యాలో నిర్వహించే ‘షాంఘై సహకార సంస్థ’ సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‌నాథ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో షోయిగు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం పలు చిత్రాలు కూడా ట్వీట్ చేసింది.